బేగంపేట మార్చి 20(జే ఎస్ ది ఏం న్యూస్ ) :
బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ‘ఓపెన్ డే’ ని ఘనంగా నిర్వహించారు.దొడ్ల డైరీ అధినేతలు – అబ్బవరం మధుసూదన్ రెడ్డి, బాలకృష్ణా రెడ్డి, ఎమ్.సూర్యప్రకాశ్ లు అక్షయ పాత్ర ప్రాంతీయ కార్యదర్శులు- అల్లం అవినాష్, అనూష లు ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పరిశోధనలను అభినందించారు.వారి ప్రయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఇందులో పాల్గొన్న 26 డిపార్ట్ మెంట్ అధ్యాపకులను ప్రసంశించారు.గత రెండు సంవత్సరాలుగా దొడ్లడైరీ వారి సౌజన్యంతో అక్షయపాత్ర ద్వారా కళాశాల లోని 400 మంది విద్యార్థులకు పోషక విలువలతో కూడుకున్న మధ్యాహ్నం భోజనం అందుకుంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.పద్మావతి తెలిపారు.అక్షయ పాత్ర అందిస్తున్న సేవల గురించి దొడ్ల డైరీ వాళ్ళు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ప్రాజెక్టుల ప్రదర్శన లో ప్రతిభ చూపిన వారికి ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులను అందజేసారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.కళాశాల, వైస్ ప్రిన్సిపాల్ టి.భాస్కర్ రెడ్డి,ఐక్యూఎసి కో- ఆర్డినేటర్-డా.ఆనీ షెరాన్, పరీక్షల నియంత్రణాధికారి డా.డి పుష్ప,ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు,ఎన్ సి.సి.ఆఫీసర్, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది,వివిధ వాలంటీర్లు,కాడెట్లు పాల్గొన్నారు.

