జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సంధర్భంగా శుక్రవారం ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని మరియు పట్టణ అధ్యక్షులు ముత్తినీడి సాంబ శివ రావు భక్తులకు ఏర్పాటు చేసిన పులిహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమం లో వైసిపి దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, కుమ్మిత అంజి రెడ్డి ,కేసరి రాంభూపల్ రెడ్డి , సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు






