దాసరి ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం దాసరి కనకయ్య నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శుక్రవారం రెడ్ క్రాస్ భవనంలో దాసరి ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతారావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ .వి సుబ్బారావు ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, బ్రేక్ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్ ,రెడ్ క్రాస్ సెక్రటరీ శ్రీమన్నారాయణ. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య,చీమకుర్తి జడ్పిటిసి హేమ శ్రీనివాసరావు , ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ .సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐ.వి సుబ్బారావు మాట్లాడుతూ…. దాసరి ప్రసన్న 12వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం 50 మంది పైగా బ్లడ్ డొనేషన్ చేయటం అభినందనీయం అన్నారు. ప్రతి సంవత్సరం కనకయ్య ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటుచేసి ఎంతోమందికి ప్రాణదానం చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యపైన దృష్టి పెట్టాలన్నారు . జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. దాసరి ప్రసన్న చిన్న వయసులోనే ప్లేట్లెట్స్ పడిపోయి రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనను గుర్తు చేసుకుని కన్నీరు పర్యంతం అయ్యారు. ఎవరైనా రక్తం అందకుండా మరణించకూడదని సంకల్పంతోటి ఆమె మరణించి 12 సంవత్సరాలు అయినా ప్రతి ఏడాది ఆమె వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానాన్ని కల్పిస్తున్న దాసరి ప్రసన్న ఫౌండేషన్ ను అభినందించారు ట్రాఫిక్ సిఐ పాండురంగా రావు మాట్లాడుతూ… యువత మత్తు పదార్థాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ప్రసన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కిరణ్ మాట్లాడుతూ… దాసరి కనకయ్య పాప మృతి చెంది 12 సంవత్సరాల అయినా నేటికీ ఆమెను గుర్తుంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. చీమకుర్తి జడ్పిటిసి హేమ శ్రీనివాసరావు మాట్లాడుతూ ….తన పాప కూడా రోడ్డు ప్రమాదం జరిగితే రక్తం అందక అనేక ఇబ్బందులు పడ్డామని ఆ సమయంలో దాసరి కనకయ్య నా పక్కనే ఉన్నారని అన్నారు. మరొకరికి రక్తం అందక ప్రాణాలు పోకూడదని సంకల్పంతోటి రక్తదాన శిబిరాలని కనకయ్య ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా రక్తదాన చేయటం జరిగింది.

