ఆల్ ఇండియా అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కార్యవర్గ సమావేశంలో ఎపీ అంసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్పార్టీ చైర్మన్, దర్శి నియోజక వర్గ ఇన్చార్జి కైపు క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు. డిల్లీలో శనివారం ఇందిరా భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆంధ్ర ప్రదేశ్లో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలు, రైతులు గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందులు, బిజేపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై అవలంభిస్తున్న విధానాన్ని దుయ్య బట్టారు. అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల గురించి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీల గురించి ప్రస్తావించారు. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురాక పోక పోవటంపై, బిజేపి చేస్తున్న మతాల మధ్య గొడవలు, ఎపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై కార్యవర్గ సమావేశంలో తీసుకువచ్చారు. అనంతరం మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, ఎపీ వ్యవహారాల మాజీ ఇన్చార్జి ద్విగ్విజయ్ సింగ్ ను కలసి ఎపీలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు.

