బేగంపేట ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్):
రాత్రిళ్ళు వెలగాల్సిన విద్యుత్ దీపాలు పట్ట పగలే వెలుగుతున్నాయి. బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో.ఇది గుర్తించిన స్థానికులు ఈ సమాచారాన్ని సంబంధిత శాఖాది.కారులకు సమాచారం ఇచ్చారు.అయినా అధికారులు స్పందించడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.బేగంపేట పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ తాత చారి కాలనీ మహాపరి నిర్వహణ కు వెళ్ళే మార్గం లో ఉన్న వీధి దీపాలు వెలగడం లేదు.దీంతో ఈ రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంటుంది.దీంతో సాయంత్రం అయిందంటే చాలు అక్కడ మందుబాబులు ,గంజాయి బ్యాచ్ లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.దీంతో ఫతే నగర్ బేగంపేట మార్గం లో రాక పోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు,మహిళలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.బేగంపేట లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు లేక ప్రజలు అంధకారం లో మగ్గుతుంటే ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో మాత్రం పట్ట పగలు విద్యుత్ లైట్లు వెలుగుతుండటం,సంబంధిత శాఖాది కారులు పట్టించుకోక పోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
