సనత్ నగర్ ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని బి కే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత బోజన పంపిణీ కేంద్రం, చలివేంద్రం లను ఆయన ప్రారంభించారు. మంగళ వారం నుండి సుమారు రెండు నెలల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని నిర్వహకులు వివరించారు. పలువురికి భోజనం వడ్డించడమే కాకుండా ఆయన కూడా భోజనం చేసి ఎంతో రుచికరంగా, నాణ్యతతో బోజనాన్ని ఉచితంగా వడ్డిస్తూ అనేకమంది ఆకలి తీరుస్తున్న నిర్వహకులను అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి రోజు సుమారు 250 మందికి దాతల సహకారంతో ఇంటి బోజనాన్ని మరిపించే విధంగా ఎంతో రుచికరంగా బోజనాలు వడ్డిస్తూ అనేకమంది ఆకలిని తీరుస్తున్నారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్ధ సారధిని, కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలను ప్రశంసించారు. సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ చేపట్టే కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చానని, ఇకముందు కూడా ఉంటాయని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 65 నుండి 95 సంవత్సరాల వయసు కలిగిన 170 మంది సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ గా ఏర్పడి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్ధులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ, హెల్త్ క్యాంప్ ల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. తమ వయసును సైతం లెక్కపెట్టకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ తమ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సేవా కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనే కౌన్సిల్ లోని పలువురు సభ్యులు కరోనా సమయంలో మరణించారని, వారు గుర్తుకొచ్చినప్పుడు తన మనసుకు ఎంతో బాధ కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, డాక్టర్ లు సుష్మ, ప్రియాంక, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అద్యక్షుడు దూబే, మాజీ అద్యక్షులు మాణిక్ రావ్ పాటిల్, సభ్యులు సహదేవ్ గౌడ్, కృష్ణ దేవ్ గౌడ్, కృష్ణా రెడ్డి, జె.ప్రసాద్, శంకర్, రామలింగం, అనంతరెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కర్ణాకర్ రెడ్డి, ఖలీల్, గోపిలాల్ చౌహాన్, కూతురు నర్సింహ, బలరాం తదితరులు పాల్గొన్నారు.





