కంచె గచ్చిబౌలి భూముల విషయం లో బీ జే పి ,బి ఆర్ ఎస్ లు తప్పుడు ప్రచారం …..అటవీ భూమి లేదంటూ అధికారులు నివేదిక ఇచ్చారు…ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర ……తెలంగాణా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యకురాలు… బోయల పల్లి రేఖ……

రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లి మండలం కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోనీ 400 ఎకరాల భూముల వ్యవహారం విషయంలో బి జే పి,బి ఆర్ ఎస్ లు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణా ప్రజలు వారి మాటలు నమ్మరని తెలంగాణా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యకురాలు రేఖ బోయిలపల్లి విమర్శించారు. ఈ ప్రాంతంలో అటవీ భూములు లేవంటూ ఇప్పటికే అధికారులు నివేదిక ఇచ్చారని అన్నారు.ఆ రెండు పార్టీ ల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఈ విధమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.1976 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1700 ఏకరాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించిన విషయాన్ని ఆ రెండు పార్టీ లు గుర్తించాలన్నారు.దానికి పక్కనే ఉన్న 800 ఎకరాల భూమి నీ 2003 లో ఐ ఎం జి భారత్ అనే సంస్థకు అప్పగించిందన్నారు.అప్పటి. తెలుగుదేశం ప్రభుత్వం ఆ సంస్త పనులు ప్రారంభించక పోవడం తో 2004 లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని తిరిగి ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలని కోరింది.దానిపై ఐ ఎం జి భారత్ సంస్త న్యాయస్థానాన్ని ఆశ్రయించిందన్నారు.అప్పటి నుంచి న్యాయస్థానం లో పోరాడి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హయం లో రాష్ట్ర ప్రభుత్వం వారిపై గెలిచిందన్నారు.టి జి ఐ ఐ సి విజ్ఞప్తి మేరకు డిప్యూటీ కలెక్టర్ శేరిలింగం పల్లి మండల తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25 లోని 400 ఎకరాల పోరంబోకు సర్కారీ అంటే ప్రభుత్వ భూమి అని నిర్ధారించారని ఆమె స్పష్టం చేశారు.ఇందులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఎక్కడుందని.ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఒకే తాను ముక్కలైన బి జె పి ,బి ఆర్ ఎస్ ఆరోపణలు చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ,ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని రేఖా బోయల పల్లి వారికి సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *