బేగంపేట ఏప్రిల్ 2(జే ఎస్ డి ఎం న్యూస్):
ఈ నెల 6 వ తేదీన నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలంటూ మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానాలు అందాయి. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలు ఆలయాల అధికారులు కలిసి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను అందజేశారు. అమీర్ పేట లోని కుమ్మరి బస్తీ లో గల హనుమాన్ దేవాలయం ఈ ఓ జయంతి, పద్మారావు నగర్ లోని పోల్ బాల్ హనుమాన్, ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతారామచంద్ర దేవాలయం నుండి ఈ ఓ సత్యమూర్తి లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ లు రాజేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు మహేందర్ గౌడ్, అమృత, కౌసల్య, కుషాల్ తదితరులు పాల్గొన్నారు.

