వక్స్ సవరణ బిల్లు ఆమోదం మత స్వేచ్ఛను హరించటమే అని
అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కైపు క్రిష్ణా రెడ్డి అన్నారు. ఇది మైనార్టీలను అణిచివేసే కుట్ర అని అన్నారు. ముస్లీం పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లు కు టిడిపి, జనసేన మద్దతు ఇవ్వటం దారుణమని అన్నారు. ఇది అత్యంత దారుణమని, సెక్యులర్ పార్టీల ముసుకు తొలగిందని అన్నారు. ముస్లీంలకు ఇస్తార్ విందును ఇచ్చి వక్స్ ఆస్తులను కాపాడతామని చెప్పి మరోపక్క పార్లమెంట్లో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం అన్నారు. ముస్లీం పోరాటానికి పూర్తి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు.