విశాఖపట్నంలోని సింహాచలం క్షేత్రంలో
ఈ నెల 8న జరిగే వార్షిక
తిరు కల్యాణోత్సవం, 30న జరిగే అప్పన్న స్వామి నిజరూప దర్శనం చందనోత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితని ఆలయ ఈవో కొమ్ముల సుబ్బారావు ఆహ్వానించారు. బుధవారం విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అప్పన్నస్వామి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను ఆలయ ఈవో హోంమంత్రికి అందజేశారు.
