ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహారావు యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవకార్యక్రమానికి తాళ్లూరు మండలం బిసి సెల్ అధ్యక్షులు పిన్నిక రమేష్, నాగంబోట్లపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాశం సూరిబాబు లు పాల్గొని నరసింహారావు యాదవ్ కి అభినందనలు తెలిపారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ ద్వారా యాదవుల అభివృద్ధికి సహకరించాలని , ప్రభుత్వం నిర్ణయం మేరకు యాదవులందరికి మేలు జరుగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
