డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు సాంఘిక సంక్షేమశాఖ
ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు ఈనెల 5న శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి ఎన్ లక్ష్మా నాయక్ తెలిపారు. ఉదయం పది గంటలకు నెల్లూరు బస్టాండ్ సెంటర్ లో, అంబేడ్కర్ భవన్ దారికి పోవు వద్ద ఉన్న డాక్టర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారని చెప్పారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భవనంలో జ్యోతి ప్రజ్వలన చేసి, జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారని తర్వాత ముఖ్య అతిథులు ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. కావున జిల్లా లోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఒక ప్రకటనలో కోరారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యండి – జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి లక్ష్మా నాయక్
03
Apr