తాళ్లూరు మండలంలోని కొర్రపాటి వారి పాలెం ఒకటవ వార్డు సభ్యుడు కె. వెంకట రావు గురువారం తన పదవికి రాజీనామా చేసారు. 2021లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో వార్డు సభ్యుడుగా గెలుపొందారు. ఆయన గ్రామ సర్పంచి కొర్రపాటి శ్రీదేవి,రామయ్యలు పంచాయితీలో జరుగు అభివృద్ధి పనులకు అడ్డుకోవటంతో పాటు కనీసం తాగు నీటి పధకాల పనులను కూడ ముందుకు సాగనీయనందుకు, గ్రీన్ అంబాసిడార్స్ జీతాలను ఇవ్వనందుకు, బీసీ కాలనీ రోడ్డు వేయగా ఆ బిల్లుల చెల్లింపులో వివక్ష చూపిస్తుంన్నందుకు నిరసరనగా తన పదవికి రాజీనామా చేస్తున్నుట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ దార హనుమంతరావును కలిసి ఆయన అందజేసారు. రాజీనామా అనంతరం తగ్గు చర్యలకు సిబ్బందికి సిఫార్స్ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు.
