పారిశుద్య పరిరక్షణకు ప్రజలు సహకరించి చెత్తను రోడ్లపై వేయకుండా చెత్తబుట్టల్లో వేయాలని ఈఓఆర్డీ కల్లూరి సుందరరా మయ్య కోరారు. తాళ్లూరులో చెత్తను తీసుక వెలుతున్న ట్రాక్టర్ వద్ద వుండి ప్రజ లకు పారిశుద్యం పై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. వ్యాపారస్తులు, ప్రజలు రోడ్లపై చెత్తను వేయకుండా చెత్త బుట్టల్లో వేయాలన్నారు. ప్రతి నిత్యం పారిశుద్యకార్మి కులు చెత్తను తీసుకు వెళ్లేందుకు ట్రాక్టర్ తీసుకు వస్తున్నందున చెత్త ట్రాక్టర్లోనే వేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా వుంటే ఏలాంటివ్యాదులు దరిరావన్నారు.. ప్రజలు గ్రామపంచాయతీలకు సహకరించి గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్య పరిరక్ష ణకు తోడ్పాటు అందించాలన్నారు.
