తాళ్లూరు మండలంలోని ఎకలవ్య నగర్ ను శనివారం ఒంగోలు ఆర్ డీఓ లక్ష్మి ప్రసన్న నందర్శించారు. ఏకలవ్య నగర్ వాసులు చాలా కాలంగా తమకు ఆర్ ఓఆర్ చట్టం ప్రకారం భూములు ఇవ్వాలని విన్నవించుకుంటున్నారు. అయితే ఆ పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనకకు అన్న చందంగా సాగు తుంది. ప్రభుత్వాలు మారుతున్న తమకు న్యాయం జరగటం లేదని ఎకలవ్య నగర్ వాసులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ డీఓ శనివారం సందర్శించి వివరాలు సేకరించారు. తహసీల్దార్ సంజీవ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస రావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఏకలవ్య నగర్ ను సందర్శించిన ఒంగోలు ఆర్ డీఓ
05
Apr