గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు తాగు నీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయితీ అధికారి (డీపీఓ) జి వెంకట నాయుడు అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, రామభద్రాపురం, నాగంబొట్ల పాలెం, బొద్దికూర పాడు, లక్కవరం, దోసకాయల పాడు, బెల్లంకొండ వారి పాలెం, తాళ్లూరు. శివ రామపురం, కొర్ర పాటి వారి పాలెం చెత్త సంపద కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయా కేంద్రాలు నిరుపయోగంగా ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. తాళ్లూరులో దోర్నపు వాగు ఒడ్డున చెత్త అంతా పెద్ద కుప్పలుగా వేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేసారు. నీటి ద్వారా గుండ్లకమ్మ రిజర్వాయర్కు చేరి నీరు కలుషితంతో పాటు పూడిక పేరుకు పోయే ప్రమాదం ఉందని తక్షణం తొలగించాలని ఎంపీడీఓ దార హనుమంత రావును ఆదేశించారు. చెత్త సంపద కేంద్రాల ప్రధాన్యత ఎమిటి మీరు ఏమి చేస్తున్నారు? కార్యదర్శులచే ఏమి పనిచేయిస్తున్నారంటూ ప్రశ్నించారు. తక్షణమే చెత్తను తొలగించాలని ఆదేశించారు. క్లాప్ మిత్రలు ఎం మంది ఉన్నారు ? పన్నుల వసూళ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంద్ర – స్వచ్ఛాంధ్ర క్షేత్ర స్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి 250 కుటుంబాలకు క్లాప్ మిత్రలను నియమించనున్నట్లు చెప్పారు. చెత్త సేకరణ విధులు ఖచ్చితంగా జరిగేలా చూడాలని కోరారు. ఓవర్ హెడ్ ట్యాంకులలో ప్రతి 15 రోజులకు క్లినింగ్ జరిగేలా, బ్లీచింగ్ తగిన మోతాదులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పీ-4 సర్వేను పక్బందీగా జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు. వ్యక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచెయ్యాలని ఆదేశించారు.

