దళితుల ఐక్యతకోసం పోరాడిన యోధుడు మాల మహానాడు అధ్యక్షుడు పీవీరావు (పోతుల విఘ్నేశ్వర రావు) అని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య కొనియాడారు. తాళ్లూరులో శనివారం పీవీరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీవీరావు బతికి ఉంటే ఎస్సీ వర్గీకరణ జరిగేది కాదన్నారు. ఎస్సీ కులాల్లో ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించడాన్ని వ్యతిరేకించి ఉద్యమాలు నడిపిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య ఆధ్వర్యంలో పీవీరావుకు నివాళి
11
May