సంతపేటలోని శివం శరణాలయంలో ఐనేని
శ్రీరాములు మాస్టర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
శ్రీరాములు మాస్టర్
కుమారుడు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. వి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ… శివం పౌండేషన్ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిరోజు అనాధలకు పేదలకు ఒంగోలు నగరంలో శివం సంచార వాహనం ద్వారా అన్నం పెట్టి కడుపు నింపుతుందని వారికి దాతలు ఆర్థికంగా అండగా ఉండాలని తెలిపారు. మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యమ నేత కమ్యూనిస్టు ఆశయాలు గల శ్రీరాములు మాస్టర్ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఐవీ సుబ్బారావు ఆర్థిక సాయంతో శనివారం ఒంగోలు నగరంలో 300 మంది పేదలకు అన్నం పెట్టి కడుపు నింపి మానవత్వం చాటారని తెలిపారు. మాస్టారు కి శివం ఫౌండేషన్ తరపున నివాళులర్పిస్తున్నామని తెలి పారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, జర్న లిస్టులు ఏ.సురేష్ , దాసరి కనకారావు , కాంతారావు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్ని శ్రీరాములు మాస్టర్ కి ఘనంగా నివాళులర్పించారు.



