రేవంత్–నాగార్జున: విడదీయలేని రాజ‌కీయాలు, సినిమా స్నేహాలు!

రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌ల క‌ల‌యిక‌లు స‌ర్వ‌సాధార‌ణం. ప‌లు వేదిక‌ల‌పై వారు క‌లుసుకుని ప‌ల‌క‌రించుకోవ‌డం చూస్తూనే ఉంటాం.రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌ల క‌ల‌యిక‌లు స‌ర్వ‌సాధార‌ణం. ప‌లు వేదిక‌ల‌పై వారు క‌లుసుకుని ప‌ల‌క‌రించుకోవ‌డం చూస్తూనే ఉంటాం. అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున‌ల కాంబినేష‌న్ మాత్రం ఎప్పుడూ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణే. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత వీరిద్ద‌రూ రెండుసార్లు క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ క‌ల‌యిక‌ల వెనుక ఉన్న నేప‌థ్యం, ప‌రిణామాలు ఆస‌క్తిక‌రం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎన్ క‌న్వెన్ష‌న్ వివాదం.. పెరిగిన దూరం :…… గ‌తంలో నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ పై జ‌రిగిన హైడ్రా కూల్చివేతలు పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. చెరువుల ఆక్ర‌మ‌ణ ఆరోప‌ణ‌ల‌పై ఎన్ క‌న్వెన్ష‌న్‌లోని కొన్ని నిర్మాణాల‌ను హైడ్రా కూల్చివేసింది. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో తీవ్ర దుమారం రేపింది. నాగార్జున ఈ విష‌యంపై కోర్టును ఆశ్ర‌యించారు. ఆ స‌మ‌యంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్ త‌న పంథాను మార్చుకోలేదు. ఈ ఘ‌ట‌న అనంత‌రం రేవంత్, నాగార్జున మ‌ధ్య దూరం పెరిగింద‌ని అంతా భావించారు. ఈ దూరం ఎంత వ‌ర‌కు కొన‌సాగుతుందో అని ప‌లువురు అనుకున్నారు.

-దూరం త‌గ్గిన తొలి క‌ల‌యిక ….. అయితే, ఊహించ‌ని విధంగా నెల రోజుల వ్య‌వ‌ధిలోనే రేవంత్ రెడ్డి, నాగార్జున మ‌ళ్లీ క‌లుసుకున్నారు. డిసెంబ‌ర్ 26, 2024న సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధి బృందంతో క‌లిసి నాగార్జున ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిశారు. చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో నాగార్జున పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రిని శాలువాతో స‌త్క‌రించి, ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఈ స‌మావేశంలో వారిద్ద‌రూ క‌లిసి ఫోటోల‌కు ఫోజులివ్వ‌డం, న‌వ్వుతూ మాట్లాడుకోవ‌డం చూశాక వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ త‌గ్గింద‌ని స్ప‌ష్ట‌మైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *