ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ సెల్) కు తాళ్లూరు మండల అధికారులు సోమవారం డుమ్మా కొట్టారు. ఒక వైపు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించమని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నానరే కనీసం గ్రీవెన్స్ సెల్లో పాల్గొనేందుకు అన్ని శాఖల అధికారులు ఇష్ట పడటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాన్ఫిరెన్స్ హాల్లో ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. కాని సోమవారం మాత్రం తహసీల్దార్, ఎంపీడీఓలతో పాటు మిగిలిన శాఖల అధికారులు ఎవ్వరూ కూడ రాక పోవటంతో ఖాళీ క
కుర్చీలు దర్శన మిచ్చాయి.
