రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ ను నెల రోజుల పాటు నిర్వహణ – జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

భారతీయ సంస్కృతి లో భాగమైన యోగ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈనెల 21 న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగ కార్యక్రమాలు నిర్వహించేలా
రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మంగళవారం ఉదయం త్రిపురాంతకం మండల కేంద్రంలోని శ్రీమత్ బాల త్రిపురసుందరీ దేవి అమ్మ వారి దేవస్థానం ఆవరణ నందు యోగాంధ్ర- 2025లో భాగంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, వై పాలెం నియోజక వర్గం ఇంచార్జి ఎరిక్షన్ బాబు, దేవస్థానం చైర్మన్ ఐవి సుబ్బారావు లతో పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి లో భాగమైన యోగ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈనెల 21 న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగ కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొను యోగ కార్యక్రమానికి 5 లక్షల మంది ప్రజలు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలోని గుండ్లకమ్మ,, త్రిపురాంతకం, పాకల, కొత్త పట్నం బీచ్ తదితర 4 పర్యాటక ప్రదేశాలను యోగాంధ్ర కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈరోజు చారిత్రాత్మకమైన శ్రీ శ్రీమత్ బాల త్రిపురసుందరీ దేవి అమ్మ వారి దేవస్థానం ఆవరణ లో సుమారు రెండు వేల మంది తో యోగా అభ్యాసాన్ని చేయడం జరుగుచున్నదన్నారు. భారత ప్రభుత్వ ప్రతిపాదనతో
2014 సంవత్సరంలో 170 దేశాల ఆమోదంతో ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. యోగ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. భారత సంస్కృతి లో అంతర్భాగం అయిన యోగ ను ప్రతి రోజూ సాధన చేసినట్లయితే దైనందిన జీవితంలో చురుకుగా ఉండటంతో పాటు ఆరోగ్య కరమైన జీవితం సాగించేందుకు వీలుంటుందన్నారు. అందరూ యోగాని తమ జీవితంలో భాగం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, దాని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రజలు తమ జీవన విధానంలో యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యమైన జీవనం సాగించాలన్నారు.యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 9.66 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. 100 మందికి మాస్టర్ ట్రైనర్స్ గా యోగ పై శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరు 6415 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరు గ్రామ స్థాయిలో ప్రజలకు యోగ పై శిక్షణ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలో మరియు ప్రతి పట్టణ కేంద్రాల్లో యోగ రోడ్డు ను నిర్ధారించి ప్రతి రోజూ యోగ సాధన చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన యోగ ప్రోటోకాల్ ప్రకారం యోగాంధ్ర క్యాంపెయిన్ జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు.
వై పాలెం నియోజక వర్గం ఇంచార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. యోగ సాధన అనేది మనస్సును లగ్నం చేయడంతో పాటు ఏకాగ్రత పెంపొందడంతో పాటు మనిషి జీవన విధానంలో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఇంతమంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగా ను జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు.
అనంతరం పతంజలి యోగ గురువు బాల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదీత్ వెంకట త్రివినాగ్, వై పాలెం నియోజక వర్గం ఇంచార్జి ఎరిక్షన్ బాబు దేవస్థానం చైర్మన్ ఐ వి సుబ్బారావు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిఎంహెచ్ఓ డా వెంకటేశ్వర రావు, పశు సంవర్థక శాఖ డిడి రవి కుమార్, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఆలయ ఈఓ రజనీ కుమారి, పర్యవేక్షకులు రంగరాజు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు, విద్యార్ధినీ విద్యార్థులు సుమారు రెండు వేల మంది యోగాసనాలు వేశారు.
ఈ యోగ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *