తాళ్లూరు మండలంలోని కొర్రపాటి వారి పాలెంలో పలు అభివృద్ధి పనులు, సైడు కాలువలు మంజూరు చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియాను టిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు కోరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో ఆయన జిల్లా కలెక్టర్కు అభ్యర్థించారు. మాగుంట కూడ జిల్లాలోని పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినట్లు గొల్లపూడి వేణుబాబు తెలిపారు.
