రైతులు వ్యయాన్ని తగ్గించి లాభాలను పెంచే విధంగా క్షేత్రస్థాయిలో తగిన సూచనలు
చేసేందుకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. లక్కవరం గ్రామంలో బుధవారం వికసిత్ కృషి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ శాస్త్ర వెత్త డాక్టర్ ఎన్ వి రామా రావు మాట్లాడుతూ రైతులు సాంకేతికతను ఉపయోగించుకుని నికర ఆదాయం పొందాలని కోరారు. నూనె గింజల ఉత్పత్తి సాధించటమే ప్రధాన లక్ష్యమని అన్నారు. జిల్లాలో గతంలో ఆముదం పంట విస్తారంగా పండించే వారని ప్రస్తుతం రూ.1.46వేల కోట్ల విలువైన నువ్వులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. నువ్వుల సాగు వలన కలిగే లాభాలను, యాజమాన్య పద్ధతులను వివరించారు. కెవికే శాస్త్రవెత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మంచి రకాల విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేసుకోవాలని కోరారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, భూసార పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఖరీవ్ పంటల సన్నద్ధతకు సిద్దమై ముందస్తు చర్యల గురించి తెలిపారు. ఉ ద్యాన వనశాఖ ఇస్తున్న రాయితీలు, డ్రిప్, స్పింక్లర్లు, యంత్రాలపై ఇస్తున్న రాయితీల గురించి చెప్పారు. ఆత్మ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఇస్తున్న శిక్షణలు, సలహాలు, సూచనలు రైతుల ప్రశ్నలకు ముఖా ముఖి సలహాలు,సూచనలు తెలియజేసారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరెడ్డి, హనుమా రెడ్డి, లక్ష్మి రెడ్డి, ఏపీ ఎం ఐ పి అమృత, హెచ్ ఈఓ స్వర్ణలత, బి టి ఎం జ్యోతి, ప్రకృతి సాగు ఇన్చార్జి నరిసింహా, తదితరులు పాల్గొన్నారు.
