మాకు ఈ అరాచక, విధ్వంస పాలన వద్దు అని ప్రజలకు ఇచ్చిన తీర్పుకి ఏడాది కాలం పూర్తయిందని, దర్శి నియోజకవర్గంలో తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని, కేవలం ఒక్క నెల ముందు వచ్చిన తనకు దర్శి నియోజకవర్గ ప్రజలు లక్ష ఓట్లు వేశారని, ఇంకొంచెం ముందు వచ్చుంటే తాను ప్రజలకు మరింత దగ్గరయ్యేదాన్నని, అయినా ప్రజల తీర్పుని గౌరవించి వాళ్ళని మరింత అర్థం చేసుకోవాలి అనే సంకల్పంతో ప్రజల్లో తిరుగుతున్నానని దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా టిడిపి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ..
వైసిపి వాళ్లు మాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా, కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజలు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారని ర్యాలీలు చేస్తారా… అని ప్రశ్నించారు.
2019లో మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కదా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచింది అని అన్నారు.
నా ఎస్సీ, నా ఎస్టి అంటూనే వారికి అందించే 27 పథకాలను నాశనం వేశారు అని – అది వెన్నుపోటు కాదా అని,
నిరుద్యోగులను ఆదుకోకుండా గాలికి వదిలేసారు – అది వెన్నుపోటు కదా అని,
బడుగు బలహీన వర్గాలను అణిచివేశారు అది వెన్నుపోటు కాదా అని,
విద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ లు మా ప్రభుత్వం ఇస్తే, అవి నిలిపివేశారు అని – అది వెన్నుపోటు కదా అని
ఆస్తులు కోసం కన్న తల్లి ని, చెల్లిని ఇంటి నుండి బయటికి గెంటివేశారు – అది వెన్నుపోటు కదా అని అన్నారు.
2019 లో మిమ్మల్ని గెలిపించినందుకు ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసం సృష్టించారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారు, మాట్లాడితే కొట్టడం కేసులు పెట్టడం మీ విధ్వంశ పాలనకు నిదర్శనం అని అన్నారు.
మీ నిరంకుశ పాలనను ప్రశ్నిస్తే చంపి డోర్ డెలివరీ చేయడం మీ వెన్నుపోటుకు నిదర్శనం అని
దళిత డాక్టర్ సుధాకర్ ని నడిరోడ్డు మీద కొట్టి చంపారని, మహిళల మీద అత్యాచారాలు, హత్య రాజకీయాలు మీ నైజం అని విమర్శించారు.
రౌడీ షీటర్లను, గంజాయి విక్రయించే వారిని ప్రోత్సహించి వాళ్లను పరామర్శించడానికి వస్తారని.. దీని ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు … అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ, అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ, ఒకవైపు రాజధాని నిర్మాణం, అభివృద్ధి మరోవైపు సంక్షేమం అందరికీ అందేలా చూస్తున్నారని అన్నారు.
పెన్షన్లు, గ్యాస్ సిలిండర్, అన్న క్యాంటిన్ , రోడ్లు, డ్రైన్లు, రోడ్ల మరమ్మత్తులు, విద్య వ్యవస్థలో సంస్కరణలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆగస్టు 15న ఉచిత బస్ సౌకర్యం ఉంటే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజల వెన్నంటే ఉంటున్నారని అన్నారు. పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్న మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
10 లక్షల కోట్ల అప్పులు రాష్ట్ర ప్రజల మీద పెట్టి, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేశారని, అంతటి సంక్షోభంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందేలా చేస్తున్నారని , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఐటి మరియు విద్య శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు, వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, మహిళలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి దర్శి నియోజకవర్గ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, మున్సిపాలిటీ చైర్మన్ నారేపు శెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం సుబ్బారావు నియోజకవర్గ మండల పార్టీ బాధ్యతలు పాల్గొన్నారు.


