బెంగళూరులోని ఆర్ సి బి విజయోత్సవాల సందర్భంగా జరిగిన విషాద ఘటనపై ప్రధానినరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.చిన్నస్వామి స్టేడియం ప్రాంగణానికి సమీపంలో ఉన్న డ్రెయిన్‌పై ఉంచిన తాత్కాలిక స్లాబ్‌పైకి భారీగా జనం చేరడంతో అది కూలిపోయిందని తెలుస్తోంది. ఫలితంగా తొక్కిసలాట జరగగా, 11 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం విపరీతంగా తరలివచ్చారు. అభిమానులు తమ క్రికెట్ జట్టు హీరోలను చూసేందుకు తెగ ఆసక్తి చూపించారు.
