చీమకుర్తి పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి – స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా…. పలు రికార్డుల పరిశీలన -స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్యలు చోటు చేసుకోకుండా పటిష్ట నిఘా ఉంచాలి -మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలి -గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలి

వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి చీమకుర్తి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఒంగోలు డీఎస్పీ, చీమకుర్తి సీఐ ఈ తనిఖీలో పాల్గొన్నారు. ముందుగా పోలీస్ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ డ్రిల్ నిర్వహించగా, సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ యొక్క పరిసర ప్రాంతాలను, పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి రిసెప్షన్, లాక్ అప్ రూమ్, ప్రాపర్టీ/స్టోర్ రూమ్, రికార్డు రూమ్ లను, రెసెప్షన్స్ రిజిస్టర్, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, పలు షీట్స్, కేసు డైరీలను, రిజిస్టర్లు మరియు పలు రికార్డులన్నీ పరిశీలించారు.
విచారణలో ఉన్న గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసుల యొక్క పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదని మొదలగు అంశాలను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దర్యాప్తులో ఉన్న కేసులలో వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని, సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని, అధికారులకు సదరు కేసులలో తగిన సూచనలు సలహాలను సూచించారు. సిసిటిఎన్ఎస్ లో ఎఫ్ఐఆర్ నుండి కోర్ట్ డిస్పోజల్ వరకు ప్రతి ఒక్క ఫైల్ ను అప్డేట్ చేయాలని ఐజి ఆదేశించారు. విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలని అధికారులకు ఐజి ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల పరిస్థితి, నమోదైన కేసుల వివరాలను తెలుసుకొని వాటి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. చీమకుర్తి ప్రాంతానికి వేరువేరు రాష్ట్రాల నుండి ఉపాధి నిమిత్తం క్వారీ లో పని చేయుటకు వస్తుంటారని, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా నేరాలు నమోదవుతున్న ప్రాంతాల్లో అధికంగా గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. దొంగతనాల నివారణకు రాత్రి సమయాల్లో పటిష్ట బీట్ సిస్టంను ఏర్పాటు చేయాలని, అసాంఘిక/చట్టవ్యతిరేక కార్యకలాపాలు ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటిని అరికట్టాలని సూచించారు. ఆనంద్ గ్రానైట్ క్వారీ మరియు కృష్ణ సాయి గ్రానైట్ లను ఐజి గ మరియు జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ పరిశీలించి, గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల/డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలనీ, అదే విధంగా సిసి కెమెరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అరికట్టాలని, పాత నేరస్థులు రిపీటెడ్ అఫెండర్స్ పై నిఘా ఉంచాలని, పెట్టి కేసులను నమోదు చేయాలని, విద్యార్థిని లకు గుడ్ టచ్ &బ్యాడ్ టచ్, రోడ్డు సేఫ్టీ నియమాలు, సైబర్ నేరాలు, చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్గించాలని ఆదేశించారు.

పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా ధైర్యాన్నిచ్చేలా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మెలగాలని, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించినప్పుడు ఎలాంటి నేరాలు జరగకుండా, ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం అందించడం జరుగుతుందని ఐజీ తెలిపారు.

ఈ తనిఖీలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఎస్సైలు కృష్ణయ్య, హరిబాబు, శివరామయ్య మరియు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *