రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం జిల్లా కలెక్టర్ల తో వర్చువల్ గా సమావేశమై వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించి ఎరువులు, పొగాకు కొనుగోలు, డ్రోన్స్ వినియోగం, సీజనల్ కండిషన్స్, పంట నమోదు వివరాలు, రిజర్వాయర్ లో నీటి నిల్వలు, వర్షపాతం, పురుగు మందుల వినియోగం మరియు సేంద్రీయ వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. పొగాకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పొగాకు కొనుగోలును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి, సంబంధిత జిల్లా కలెక్టర్ల ను ఆదేశించినారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు లోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ రోజు వరకు జిల్లా లో 224 మంది రైతుల వద్ద నుంచి 657 మెట్రిక్ టన్నుల” నల్లబర్లీ పొగాకు” ను కొనుగోలు చేయటం జరిగినదని, దీని విలువ సుమారు 5.5 కోట్లు వుంటుందని జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కి వివరించారు. జిల్లాకు సరిపడా ఎరువుల నిల్వలు వున్నాయని తెలియచేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, మార్క్ఫెడ్ డి ఎం శ్రీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

