ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు, మార్కాపురం టౌన్ మరియు పలు ప్రాంతాలలో డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో పెండింగ్ చలానాలపై సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ డ్రైవ్లో మొత్తం 106 పెండింగ్ చలానాలపై రూ.22,440/- జరిమానా, అలాగే, 2 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగింది. మోడిఫై చేసిన సైలెన్సర్లు ఉన్న ద్విచక్ర వాహనాలను గుర్తించి, వాటికి కంపెనీ వారు చెందిన అసలు సైలెన్సర్లు అమర్చేలా చర్యలు తీసుకున్నారు. నెంబర్ ప్లేట్లు లేని 8 ద్విచక్ర వాహనాలను గుర్తించి, వాటికి నెంబర్ ప్లేట్లు వేయించేందుకు సూచనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మార్కాపురం డీఎస్పీ మాట్లాడుతూ……. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని స్పష్టం చేశారు. మోడిఫై చేసిన సైలెన్సర్లు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ ధరించని వారి పై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందన్నారు. వాహనదారులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా మీ భద్రతతో పాటు మీ కుటుంబం ఆనందాన్ని కూడా కాపాడవచ్చని సూచించారు.
ఈ స్పెషల్ డ్రైవ్లో మార్కాపురం సీఐ సుబ్బారావు, టౌన్ ఎస్సైలు ఎం. సైదులు బాబు, డాక్టర్ ఎం. రాజమోహన్ రావు, ట్రాఫిక్ ఎస్సై అహరోన్, రూరల్ ఎస్సై అంకమ్మ రావు తదితరులు పాల్గొన్నారు.

