జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంను మంగళవారం తూర్పుగంగవరం పీహెచ్సీ పరధిలో వెలుగు వారి పాలెంలో నిర్వహించారు. వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని కోరారు. శుక్రవారం ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని కోరారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానిక స్థానిక పీహెచ్సీని సంప్రదించాలని చెప్పారు. హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్పీ నుశీల, పీహెచ్ఎన్ గోపి నాయక్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
