పంట సాగు దారు హక్కు పత్రాలతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మండలంలోని మన్నేపల్లి, దారం వారి పాలెంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న పలు నబ్సిడీ పథకాలు, పంటల భీమా, ఉద్యాన రాయితీలు ఉపయోగించు కోవాలని కోరారు. నర్పంచి వెంకటేశ్వర రెడ్డి, విఏఏలు అమృత, అశోక్, బ్రహ్మయ్య యార్డ్ అసిస్టెంట్ నురేషు తదితరులు పాల్గొన్నారు .
