తాళ్లూరు మండలంలోని లక్కవరంలోని పలుదేవాలయాల క్రింద ఉన్న భూములు కౌలు దారుల సాగు హక్కుకు మంగళవారం వేలం పాటలను నిర్వహించారు. వీరభధ్ర స్వామి, రామలింగేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, ఆంజనేయస్వామి లకు చెందిన 13 బిట్లకు చెందిన 81.43 ఎకరాలకు వేలం పాటలను నిర్వహించారు. గతంలో ఈ భూములకు వేలం పాటలో రూ.1.77 లక్షలు పాడుకోగా, నేడు రైతులు రూ. 3.22 లక్షలకు వేలం పాటలో పాడుకుని దక్కించుకున్నారు. కార్యక్రమంలో పంగులూరు గ్రూపు దేవస్థాన దేవాదాయ కార్యనిర్వాపణాధికారులు వి శ్రీనివాసరావు, ఈఓ వాను బాబు, ఆర్ ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
