ఒంగోలు నగరంలోని జిల్లా గ్రంధాలయ సంస్థలో 73 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇంచార్జి ఆర్ గోపాల క్రిష్ణ
తెలిపారు.
బుధవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ చాంబర్ లో జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇంచార్జి ఆర్ గోపాల క్రిష్ణ అధ్యక్షతన జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ సెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధి కి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా జిల్లా గ్రంధాలయ సంస్థలో 73 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ ఆధునీకరణ పనులకు గాను తొలి విడతగా 23 లక్షల రూపాయల నిధులను కూడా మంజురుచేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రాపర్టీ టాక్స్ రూపంలో కలెక్ట్ చేసే లైబ్రరీ సెస్ మొత్తాలను సంబంధత నగర పాలక సంస్థలు, గ్రామ పంచాయతీలు వెంటనే జిల్లా గ్రంధాలయ సంస్థకు బకాయలు లేకుండా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమీషనర్ల ను, జిల్లా పంచాయాతీ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వారీగా పెండింగ్ లో వున్న లైబ్రరీ సెస్ బకాయలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. దిన, వార పక్ష, మాస పత్రికల వివరాలు, వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన పుస్తకాల వివరాలను ఆరా తీశారు. గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి 2025-26 బడ్జెట్ ను మరియు కందుకూరు, వలేటివారిపాలెం, ముండ్లమూరు, కొమరోలు శాఖా గ్రంధాలయాల భవనాలకు 5 శాతం అద్దె పెంపు వంటి అంశాలను జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశంలో కమిటీ ఆమోదించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శివా రెడ్డి, ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, ఆడిట్ అధికారి రమేష్, ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని అన్నీ మునిసిపాలటీల కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.

