బేగంపేట జూలై 24(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇంటర్నేషనల్ సెల్ఫ్-కేర్ డే సందర్భంగా గురువారం కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్, బేగంపేట్‌లో “యోగ ఫర్ ఆల్” అనే ప్రత్యేక వెల్‌నెస్ కార్యక్రమాన్ని వైద్యులు, నర్సులు మరియు సిబ్బందికి అందించారు.సర్టిఫైడ్ యోగా పండితురాలు, థెరపిస్టు మరియు ఫేస్ యోగా నిపుణురాలు కార్త్యీని అంకుష్ ఆధ్వర్యంలో జరిగిన ఒక గంటపాటు సెషన్‌లో కుర్చీపై సులభంగా చేసే యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, అలాగే దైనందిన స్వీయ సంరక్షణ కోసం ఉపయోగకరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా డా. ఏ.వి. గురువా రెడ్డి, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ “వైద్యులు మరియు సిబ్బందికి స్వీయ సంరక్షణ (Self-Care) అనేది విలాసం కాదు, అవసరం అన్నారు. ప్రతిరోజూ జాగ్రత్తగా శ్వాస వ్యాయామం, క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం, మరియు తగినంత నిద్ర వంటి అలవాట్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి అవసరం,” అని అన్నారు.
ఈ కార్యక్రమంతో ఆసుపత్రి సిబ్బంది రోజువారీ జీవితంలో యోగా మరియు మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌లను అవలంబించేందుకు ప్రోత్సహిస్తూ, సమగ్ర ఆరోగ్యం మరియు నిరోధక ఆరోగ్య సంరక్షణలో కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు.


