ప్రకాశం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాల్లో వార్షిక తనిఖీలను గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి గురువారం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ పుష్ప గుచ్చమును అందజేసి ఐజీకి సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ డ్రిల్ నిర్వహించగా, సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి, ఈ డ్రిల్‌ను ఐ.జి. తనిఖీ చేశారు.
ఈ వార్షిక తనిఖీలలో గుంటూరు రేంజ్ ఐజి జిల్లా పోలీస్ కార్యాలయంలో సందర్శించి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ సెక్షన్లు, వివిధ రకాల విధులు నిర్వహించే కార్యాలయ అధికారులు, సిబ్బంది వారి వారి విధులు గురించి అడిగి తెలుసుకున్నారు. వారు నిర్వహించే రికార్డులు, పోలీసు సిబ్బంది అర్జీలు, ఉన్నతాధికారులుతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన స్టోర్ ఆర్టికల్స్ వివరాలు మొదలైన వాటిని ఐజీ గారు క్షుణ్ణంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా రికార్డులన్నీ అప్డేట్ గా ఉంచుకోవాలని తెలిపారు. జిల్లా పోలీసు అధికారుల మరియు సిబ్బంది సంక్షేమం, విధి నిర్వహణకు అవసరమైన అంశాలపై సకాలంలో స్పందించేలా సిద్ధంగా ఉండాలని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కి మరియు వారి సిబ్బందికి సూచనలు తెలియచేసారు. జిల్లా అభివృద్ధి, పోలీసు సిబ్బంది సంక్షేమం, కార్యాలయాల పనితీరు తదితర అంశాలను జిల్లా ఎస్పీ గారు ఐజీ కి వివరించారు.
అదే విధంగా, జిల్లా నేర రికార్డు బ్యూరో (డీసీఆర్బీ)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వారి విధుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి విభాగంలో నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియచేసారు.
పోలీస్ శాఖలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఇక పోలీసు సిబ్బంది కూడా కొత్త సాంకేతికత పై అవగాహన కలిగి ఉండేలా నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత, సమర్థత పెరిగి ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. సిబ్బంది పిల్లల విద్య మరియు ఉద్యోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఏదైనా వ్యక్తిగత లేదా విధి సంబంధిత సమస్యలు ఉంటే తెలియచేయాలన్నారు. పోలీసు శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఐజి గారు పేర్కొన్నారు.
వార్షిక తనిఖీల్లో గుంటూరు రేంజ్ ఐ.జి తో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరావు, ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమణ కుమార్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా పోలీసు కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్మోహన్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, సీఐలు విజయకృష్ణ, నాగరాజు, యం. శ్రీనివాసరావు, శ్రీకాంత్ బాబు, సుధాకర్, జగదీష్, షమీముల్లా రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు రమణా రెడ్డి, సీతారామిరెడ్డి,పోలీస్ సిబ్బంది మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

