ఆషాడమాసం పూర్తయి శ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి తదియారాధన సంఘం ఆధ్వర్యంలో గాంధీ రోడ్డు, కన్యకాపరమేశ్వరి అమ్మవారి వీధిలో కొలువైయున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి శాకంబరిగా భక్తులను అనుగ్రహించారు. ఆలయమంతా శాకములతో అందంగా అలంకరించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ, ఫణిశర్మలు మాట్లాడుతూ ప్రకృతి అంటే పరమేశ్వరి సమృద్ధిగా పండుతున్న పంటలను కూరగాయలను అమ్మవారికి అలంకరించి అమ్మవారి కృపా కటాక్షాలను తద్వారా అభివృద్ధి శ్రేయస్సును మరియు ఆహార భద్రతను కలిగించమని వారిని వేడుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వర్షారంభ కాలం సంపూర్ణ ఆరోగ్యం పొందడం కోసం పలు రకాల కూరగాయలతో ఆహారాన్ని స్వీకరించడం మంచి ఫలితాన్నిస్తుందని తెలియని చెప్పడం కోసం దేవతామూర్తులకు శాకాంబరి అలంకారం చేయడం జరుగుతుంది అని తెలిపారు. వ్యవసాయ రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించడానికి తగినంత శక్తిని, అభివృద్ధి ప్రసాదించమని అమ్మ వాసవి దేవిని శాకాంబరీ దేవిగా అలంకరించామని తెలిపారు.
శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి శుక్రవారం మంగళవారము భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
తదియారాధన సంఘం ప్రతినిధులు, సేవాదళ్ సభ్యులు తాతా రామకృష్ణ, పువ్వాడ విజయ్ కృష్ణ, రాము, గ్రంధి శ్రీనివాసులు, పబ్బిశెట్టి అశోక్, బాదం మురళి, శ్రీరామ్, ఆర్టీసీ సురేష్, అనిల్, సిహెచ్ హరికృష్ణ తదితరులు కార్యనిర్వహణ చేశారు. పెద్ద సంఖ్య లో భక్తులు అమ్మవారిని దర్శించి ధన్యత పొందారు.

