భూసార పరీక్షా ఫలితాలతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వనరుల
కేంద్రం టెక్నికల్ వ్యవసాయాధికారి వి శేషమ్మ తెలిపారు. తాళ్లూరు -1, 2 రైతు సేవా కేంద్రాల పరధిలో రైతులకు శుక్రవారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లో బాగంగా ఖరీఫ్ సాగు చేసే పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్దతులపై వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై తాళ్లూరు ఏవో ప్రసాద రావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిఆర్నీ ఎవో శేషమ్మ మాట్లాడుతూ భూసార ఫలితాల ఆధారంగా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పారు. వరి, మొక్కజొన్న, కంది, సజ్జ, మిరప పంటలలో విత్తనం వేసే వద్ద నుండి పంట కోత వరకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులను వివరించారు. యాజమాన్య పద్ధతుల కరదీపికలను వ్యవసాయాధికారి ప్రసాద రావు, డిఆర్పీ ఎవోలు అందించారు. విఏఏ లు సాయి, ఫిషరీన్ అసిస్టెంట్ మణి కశేర, ప్రకృతి సాగు ఐసీఆర్పీ లు పాల్గొన్నారు.

