సంక్షేమ వసతి గృహాలలో చదువుచున్న విద్యార్ధుల సంక్షేమం, వసతుల కల్పన, ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
శనివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు లోని జిజిహెచ్ ను సందర్శించి శుక్రవారం రాత్రి సింగరాయకొండ బాలుర వసతి గృహంలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థి ఎస్. ఆంజనేయులు ను మరియు ఈ నెల 21 న గిద్దలూరు కళాశాల బాలుర వసతి గృహంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థి శివకుమార్ ను పరామర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ… సింగరాయకొండ గృహంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్ధి ఆంజనేయులు ను అలాగే ఈ నెల 21 న పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న గిద్దలూరు కళాశాల బాలుర వసతి గృహం విద్యార్థి శివ కుమార్ ను పరామర్శించడం జరిగిందని, వీరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీరికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ రెండు సంఘటనలు జరిగిన వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తక్షణం స్పందించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందేలా జీజీహెచ్ లో చేర్పించడం జరిగిందన్నారు. సంక్షేమ వసతి గృహాలలో చదువుచున్న విద్యార్ధుల సంక్షేమం, వసతుల కల్పన, ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి వెంట ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, జీజీహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.




