హైదరాబాద్ జులై 26(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణా రాష్ట్ర మహిళా కమీషన్ ఆద్వర్యం లో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అన్ని జిల్లాల డి వి కౌన్సిల్లర్లతో పాటు సఖి సెంటర్ల అడ్మిన్ లకు బి ఎన్ ఎస్ , బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ లపై అవగాహన కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నైపుణ్యాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి చైర్ పర్సన్ శారద మాట్లాడుతూ తీవ్ర మనోవేదనతో వచ్చే బాధిత మహిళలకు తగిన న్యాయం చేసే ప్రక్రియలో డివి కౌన్సిలర్లు మరియు సఖి సెంటర్ నిర్వాహకుల పాత్ర ముఖ్యమైనదని చైర్ పర్సన్ నేరెళ్ళ శారద అన్నారు. అందువల్ల వారికి చట్టాల పై మరింత అవగాహన కల్పించే విధంగా అవగాహన సదస్సులు ప్రారంభించామని, తొలి సదస్సు హైదరాబాద్ నుండి ప్రారంభించడం జరిగిందని చైర్ పర్సన్ శారద అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాక్ట్ లపై అవగాహన కల్పించే విధంగా మరిన్ని సదస్సులు నిర్వహిస్తామని నేరెళ్ళ శారద అన్నారు. మహిళల భద్రత పట్ల మహిళా కమిషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన మరియుఇతరఉన్నతాధికారులతో పాటు మహిళా కమిషన్ సిబ్బంది, అన్ని జిల్లాల డివి కౌన్సిలర్లు, సఖి సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

