దర్శి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కార్గిల్ విజయ్ దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఖాదర్ మస్తాన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మానవతా స్వచ్చంద సంస్థ డైరెక్టర్, జిల్లా ఐ ఆర్సీ ఎస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కపురం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. రక్షణ శాఖలో సేవలు అందించిన మార్తల వెంకటేశ్వర రెడ్డి, ఉన్నం వెంకట కోటయ్యలను ఘనంగా సన్మానించారు. దేశం కోసం అసువులు బాసిన అమర వీరుల త్యాగాలను వక్తలు కొనియాడారు. అనంతరం జై జవాన్ జై కిసాన్ అంటూ విద్యార్థులు నినదించారు. ఉపాధ్యాయులు కబీర్, కీర్తి, కూనం జైహింద్ రెడ్డి, సాంబశివ రావు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

