పేదరికం నుంచి మరియమ్మ కుటుంబం బయటపడేలా అవసరమైన సహాయం చేస్తాను -జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పథకం పీ – 4. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా వ్యక్తిగతంగా తాను కూడా పేదలకు అండగా నిలుస్తాను అంటూ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ముందుకు వచ్చి ఇటీవల మద్దిపాడు మండలం, మల్లవరం గ్రామంలోని దళితురాలైన గొల్లపాటి మరియమ్మ కుటుంబాన్ని దత్తతు తీసుకుని మల్లవరం గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో కూర్చుని ప్రత్యేకంగా వారితో మాట్లాడి వారి ఇబ్బందులు, అవసరాలు తెలుసుకోవడం జరిగింది. తన భర్త చనిపోయారని, కుమార్తె , కుమారుడు ఉన్నారని, కూలి పనులు చేసుకునే తమకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు మరియమ్మ ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కు వివరించారు. వారి కుటుంబ పరిస్థితిని, ఆర్థిక స్థితిని అడిగి తెలుసుకున్న జాయింట్ కలెక్టర్… వారసత్వంగా వచ్చిన స్థలంలో కట్టుకోవడానికి తక్షణమే ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఇచ్చిన హామీను నెరవేరుస్తూ ఆదివారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ
మల్లవరం గ్రామాన్ని సందర్శించి మరియమ్మ ఇంటికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు సహాయం కూడా చేస్తానని చెప్పారు. పేదరికం నుంచి మరియమ్మ కుటుంబం బయటపడేలా అవసరమైన సహాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఎం పి డి ఓ జ్యోతి, గ్రామ సర్పంచ్ సుబ్బారెడ్డి, హౌసింగ్ శాఖ అధికారులు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *