జిల్లాలో ప్రసిద్ధి చెందిన తాళ్లూరు మండలం సోమవరప్పాడు పరిధిలోని గుంటి గంగాభవాని అమ్మవారికి అదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు కురిపించి చల్లగా చూడు గంగమ్మా అంటూ పూజలు ప్రత్యేక పూజలు చేసారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం, ఈఓ వాసు బాబు, ఆర్ ఏ ప్రసాదు భక్తులను కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.
