జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, ఒంగోలు సహాయ వ్యవసాయ సంచాలకులు , మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు . కొత్తపట్నం మండల కేంద్రంలోని శివాలయం వీధి నందు గల షా ఎంటర్ప్రైజెస్ రిటైల్ ఎరువుల దుకాణంను తనిఖీ చేసి రైతులకు యూరియాను అధిక ధరకు అమ్ముతున్నట్లు రైతుల ద్వారా తెలుసుకొని 6A కేసు ఫైల్ చేశారు. మరియు సుమారు 4.86 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్ చేయడం జరిగింది. మొత్తం సీజ్ చేసిన యూరియా నిల్వల విలువ రూ.28782/-
అనంతరం రాజుపాలెంలో గల బాలాజీ ఏజెన్సీస్ ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది. నిల్వలు, స్టాక్ తనిఖీ చేసి రైతులను కూడా విచారించడం జరిగింది.
