దర్శి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల లో విశ్వమాత మదర్ థెరిసా116 వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాదర్ మస్తాన్ అధ్యక్షత వహించగా,
ముఖ్య అతిధిగా ప్రకాశం జిల్లా ‘ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియు జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
మదర్ థెరిసా
చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు భారతదేశానికి మదర్ థెరిసా చేసిన సేవలను కొనియాడారు.తదుపరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మదర్ థెరిసా
ఎక్కడో ఇతర దేశమైన యుగోస్లేవియాలో పుట్టి, ‘ఆగ్నస్ గోన్షా భోజాక్షు’అనే పేరుతో యుక్తవయసులోనే మనదేశానికి వచ్చి,మన భారత పౌరసత్వాన్ని పొంది తెరీసా గా పేరు మార్చుకొని, వివాహం కూడా చేసుకోకుండా,అనేకమంది కుష్టురోగులను,మురికివాడలో వుండే అనేక జబ్బునపడ్డ వారందరికీ నిస్వార్థంగా సేవజేస్తూ,అనాధలకు అండగాలనే లక్ష్యంతో, కలకత్తా మహానగరంలోని అభాగ్యులకోసం సేవాదృక్పదం తో “నిర్మల్
హృదయ్” అనే స్వచ్ఛంద సంస్థ ను స్థాపించి అనేక మంది దీనులకు అండగా వుంటూ మదర్ తెరీసా గా ప్రపంచానికి పరచయమై, మహోన్నత సేవాతత్పరత గలిగిన మహిళగా,విశ్వమాతగా పేరుగాంచి, ప్రపంచలోకెల్లా అత్యున్నతమైన పురస్కారమైన నోబెల్ బహుమతిని స్వీకరించారు.అంతేగాకుండా భారత అత్యున్నతమైన పురస్కార మైన భారతరత్న,పద్మశ్రీ వంటి మరెన్నో ఉన్నతమైన అవార్డులందుకొని ఆమె జీవితాన్నే మన భారత దేశానికి అంకితం చేసిందని, కాబట్టే, మదర్ థెరిసా
మదిలో నిరంతరం స్మరించుకొని మానవ సేవయే మాధవసేవ గా భావించి, “ప్రార్థించే పెదవులకన్నా సాయంచేసే చేతులే మిన్న”అనే సూక్తిని ఎల్లపుడూ మననం చేసుకుంటూ ఇప్పటినుండే సేవా భావాన్ని అలవరచుకుని మదర్ తెరీసా అడుగుజాడలో పయనించి, సమాజానికి సేవ చేయాలని కపురం శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 450 మంది విద్యార్థులతోపాటుగా,ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


