వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముండ్లమూరు మండల అధ్యక్షుడు చింతలపూడి శ్రీనివాసరెడ్డి ఇళ్లను పోలీసుల ద్వారా కూల్చడం అన్యాయ మని దర్శి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ… గ్రామాలలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు పట్టా భూములలో ఉన్న ఇండ్లను కూల్చడం సరైంది కాదన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు జరగలేదని చెప్పారు. దర్శి సీఐ వై. రామారావు, దర్శి ముండ్లమూరు ,తాళ్లూరు ఎస్ఐలు మురళి, కమలాకర్, మల్లికార్జునలతో కలిసి మంగళవారం ఉదయం 6 గంటలకు పసుపుగల్లు గ్రామానికి వెళ్లి ఇండ్లు పడగొట్టారని, అడ్డు వచ్చిన మహిళలను కూడా పోలీసులు నెట్టివేయటం సరైంది కాదని పేర్కొన్నారు. వైసిపి నాయకులపై ఇలాంటి కక్ష సాధింపు చేయడం గతంలో ఎప్పుడూ లేదన్నారు. దర్శి మండలం, తూర్పు వీరాయపాలెంలో కూడా మహిళలను నెట్టి వైసీపీ నాయకుడు ముప్పరాజు శ్రీనుకు చెందిన ఇల్లును కూడా కూల్చారన్నారు. పోలీసులు టిడిపి నాయకులకు ఊడిగం చేయడం, వాళ్లు చెప్పినట్టు చేయడం తగదన్నారు . ఇష్టానుసారంగా మాట్లాడి తోసి వేయటం, దూషించటం గతం డూ జరగలేదన్నారు. ఈ విషయం జిల్లా ఎస్పీ, డీజీపీల వద్దకు కూడా తీసుకెళ్తామన్నారు. దర్శి నియోజకవర్గంలో వికలాంగులవి 579 పెన్షన్లు తీసివేయటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. వైసిపి ముండ్లమూరు మండల అధ్య క్షుడు, బాధితుడు చింతా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాము 2002లో ఈ రేకుల షెడ్లు వేశామని, ఇది పట్టా భూమి అని, సైడ్
కాలువలకు లోపలనే ఉందని చెప్పారు, కానీ ప్రభుత్వం అధికారంలో ఉందనే అహంకారంతో తన ఇళ్లను కూల్చివేశారన్నారు. మహిళలు సిఐ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదన్నారు. తాము దేనికీ భయపడేది లేదని, ఆస్తులు పోయినా, ఇబ్బందులు కలిగించినా న్యాయం కోసం పోరా డుతూ ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, వెంకటసుబ్బయ్య, జడ్పీటిసిలు రత్నంరాజు నాగిరెడ్డి, మాజీ ఎంపీపీలు పి. మధుసూదనారెడ్డి, ఇత్తడి దేవదానం, వైస్ ఎం పీపీ సోము దుర్గారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి మేడికొండ జయంతి, కుమ్మిత అంజిరెడ్డి పాల్గొన్నారు.


