ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి పలు విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డి.సి.ఆర్బీ, డి.టి.ఆర్బీ, పరిపాలన విభాగంలోని ఏబీపీ
సెక్షన్లు, అడిషనల్ ఎస్పీల కార్యాలయాలు, డీపీవో స్టోర్, మెసేజ్ సిస్టమ్ రూమ్, సర్వీస్ బుక్ రూమ్, ఇన్వార్డ్/అవుట్వార్డ్, రికార్డ్ రూమ్లను పరిశీలించారు. ప్రతి విభాగంలో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారుల నుంచి సమాచారం తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు.
ఆయా విభాగాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ విధులను గురించి విచారించారు. వారు చేపడుతున్న పనితీరును సమీక్షించి, సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు తెలియచేసారు. ఫైల్స్ పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేయాలని, రికార్డులను క్రమబద్ధంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. పలు కమిషన్ల నుండి అందే పిర్యాదులను తక్షణమే పరిశీలించి, నిర్ణీత కాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు.
సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా నిర్వహించాలని, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ విధులను బాధ్యతతో నిర్వహించాలి, పనులను వాయిదా వేయడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.
జిల్లా ఎస్పీ డిపిఓ ఏవో రామ్మోహన్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, ఆర్ఐ సీతారామరెడ్డి మరియు తదితరులు ఉన్నారు.

