అంబేద్కర్ విగ్రహానికి నిప్పు – దళితుల ఆత్మగౌరవానికి ముప్పు – అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన సతీష్ నాయుడు అనుచరులపై పీడీ యాక్ట్ పెట్టలి మనువాద మృగాలు -రాజ్యాంగ ద్రోహులు – మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య

చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం, దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన సతీష్ నాయుడు అనుచరులపై పీడీ యాక్ట్ పెట్టాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య డిమాండ్ చేశారు. శనివారం తాళ్లూరు గ్రామంలో మండల ఆఫీస్ వద్ద మరియు అంబేద్కర్ జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో దారా అంజయ్య మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహానికి నిప్పు, దళిత బహుజనుల ఆత్మగౌరవానికి ముప్పు అని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో దళితులపై అంబేద్కర్ విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడులే, మోడీ మనువాద ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చబోతుందనేందుకు సంకేతాలన్నారు. గతంలో మనువాద మృగాలు అంబేద్కర్ విగ్రహాలకు తారు పూయటం, చెప్పుల దండ వేయడం, వేలు విరగ్గొట్టటం వంటి పనులు చేశాయన్నారు. దళిత నాయకులు పాలెపోగు గడ్లస్ మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో అగ్రకుల నాయకుల ఆదేశాల మేరకు గ్రామ కంఠం భూమిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యంగా తొలగించారని, విగ్రహం స్థానంలో ఏర్పాటుచేసిన చిత్రపటాన్ని సైతం తీసుకువెళ్లారన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అల్లాడి ప్రమోద్ కుమార్, పోతులూరి జ్యోతి అను ఎస్సీ మాల యువకుల్ని స్టేషన్కు తీసుకువెళ్లి మార్టూరు సిఐ శేషగిరి అరికాళ్ళ మీద తీవ్రంగా కొట్టారన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అనపర్తి ఆదాము మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న మన వాదులు, ముందుగా దళితులను, అంబేద్కర్ భావజాలాన్ని బలహీన పరుస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి పథకంలో, ప్రతి పనిలో దళిత, బహుజనుల పట్ల వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. ఎస్సీ సెల్ నాయకులు ప్రభుదాసు మాట్లాడుతూ మాలలు స్పందించేసరికి, ప్రభుత్వం ఆగమేఘాల మీద దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. దేవళం పేట పేటలో జరిగిన సంఘటనపై మేధావులు, ప్రజాస్వామిక వాదులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు కార్యాచరణ ప్రకటించాలని దారా అంజయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంబేద్కర్ శ్రామిక సంఘం మండల నాయకులు వెంకటేశ్వర్లు రమణయ్య దేవదాసు అనపర్తి సుబ్బారావు అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *