తాళ్లూరు మండలంలోని కొర్రపాటి వారి పాలెం గ్రామంలో కొర్రపాటి రవి సంస్మరణ సభ నిర్వహించారు.
ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు, దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , నియోజకవర్గ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు లు పాల్గొని కొర్రపాటి రవి పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో తాళ్లూరు, దొనకొండ , ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్ రెడ్డి ,
మోడీ ఆంజనేయులు, కుర్రపాటి శ్రీనివాస రావు , తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యదర్శులు మానం రమేష్ బాబు , రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, కొర్రపాటి వారి పాలెం గ్రామ సర్పంచ్ కొర్రపాటి శ్రీదేవి రామయ్య ,మన్నేపల్లి సొసైటీ అధ్యక్షులు గొంది రమణారెడ్డి ,నాగం బోట్ల వారి పాలెం సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బయ్య కైపు రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

