తాళ్లూరు మండలంలోని దారం వారి పాలెం గ్రామానికి చెందిన ఇరువురు చిన్నారులను నెల్లూరు జిల్లా తెట్టు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే బాతు యజమాని వద్ద తల్లిదండ్రులు నాగులూరి పౌలు, సుభాషిణిలు పనిలో పెట్టారు. కాంట్రాక్ట్ సమయం ముగిసినా సరే తమ పిల్లలను తిరిగి అప్పగించక చూపించక పోవటంతో సమస్యలు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ బాధ్యులు కోటేశ్వర రావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన కాకినాడ ప్రాంతలో ఉన్నారని తెలిసి అక్కడ ఇండియన్ లేబర్ లైన్ ద్వారా కాకినాడ నబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు చిన్నారులకు నెల్లూరు జిల్లా తట్టుకు చేర్చారు. తమ పిల్లల ఆచూకి కోసం పోరాటం చేసిన డిబిఆర్సీ ప్రతినిధులకు, న్యాయమూర్తికి, పోలీసులకు చిన్నారుల తల్లిదండ్రులు పౌలు, నుభాషిణిలు కృతజ్ఞతలు తెలిపారు.
సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు చిన్నారుల అప్పగింత
04
Oct