ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 7న ఫ్యాప్టో
ఆధ్వర్యంలో ఈనెల 7న విజయవాడ ధర్నా చౌక్‌లో చేస్తున్న ధర్నాను విజయవంతం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎపీటీఎఫ్ ) తాళ్లూరు మండల గౌర అధ్యక్షుడు, అధ్యక్ష, కార్యదర్శులు నంగు రవి చంద్రా రెడ్డి, గండూరి నాగరాజు, నారిపెద్ది శ్రీనివాస రావు, జిల్లా కౌల్సిలర్ పోలం రెడ్డి సుబ్బా రెడ్డిలు కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18నెలల కావస్తున్నా నేటికి ఉపాధ్యాయుల నమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందగా ఉన్నాయని, 12 వ పీఆర్సీ కమిట, ఐఆర్, నాలుగు పెండింగ్‌ల డీఏ, ఈ హెచ్ ఎన్ అమలు, ఉపాధ్యాయులను యాప్‌ల భారం నుండి తప్పించుటకు తగిన చర్యలు వంటి వి ఏవి తీసుకోలేదని చెప్పారు.
మండలం నుండి అన్ని ఉపాధ్యాయ సంఘాలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాను విజయవంతం చెయ్యాలి
06
Oct