ఒంగోలు పట్టణంలోని కొత్త పట్నం బస్టాండ్ వద్ద ఒక టీ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ డబ్బాలో మంగళవారం ఓ ఆవు తన మూతి పెట్టి ఇరుక్కపోయినది. చాలా సమయం వరకు ఆ డబ్బాను విదిలించుకుంటూ కొత్త పట్నం బస్టాండ్ సర్కిల్లో ట్రాఫిక్ కు అడ్డగా వెళుతూ వాహనదారులను ఇబ్బందులు పెట్టినది. దీంతో వాహనదారులు ఆవు తమ వైపు రావటం చూసి ఆందోళన చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న యువకులు ఎట్టకేలకు ఆవు తల పట్టుకుని డబ్బాను ఊడ పీకారు. దీంతో ఆవు ఊపిరి పీల్చుకుని అక్కడ నుండి జారుకున్నది. వాహనదారులు సైతం అమ్మయ్య అంటూ ముందుకు సాగి వెళ్లి పోయారు.



